
CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు.
అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. ఈ పథకం మొత్తం రూ.12,600 కోట్లతో చేపట్టారు.
దీనివల్ల గిరిజన రైతుల భూములకు సాగునీటి, సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం. రైతులకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయడం వల్ల అదనపు విద్యుత్ ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Details
విద్యుత్ వినియోగంపై శిక్షణ ఇవ్వాలి
అలాగే సౌర విద్యుత్ వినియోగంపై గిరిజనులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకం వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం కింద కేటాయించిన గిరిజన భూములన్నింటినీ సాగులోకి తీసుకురావడం, వారికి ఆర్థిక బలోపేతం చేయడం ఈ పథక లక్ష్యం. 2.10 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో 6 లక్షల ఎకరాల్లో సాగునీటి సౌకర్యాలు అందించాలని ప్రకటించారు.
ఇందిర సౌర గిరి జల వికాసం కింద గ్రామాల్లో జల వనరుల కోసం జియోలాజికల్ సర్వేలు, సోలార్ పంపుసెట్లు, బోర్లు వేయడం, ప్లాంటేషన్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు.
పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు, ఉద్యాన శాఖ, విద్యుత్తు అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు.
Details
పథకంపై అవగాహన పెంచాలి
సోలార్ పంపుసెట్లతో పాటు పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించి రైతులకు అదనపు ఆదాయం కలగడం కోసం చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గిరిజన లబ్ధిదారులకు పథకంపై అవగాహన పెంచాలని సూచించారు.
అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతుల పొలాల్లో వంద రోజుల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
సోలార్ విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ విధంగా, అందరికీ సాగునీటి, సౌర విద్యుత్ సౌకర్యాలు అందించే ఇంత పెద్ద పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్రంలో గిరిజనుల ఆర్థిక ప్రగతికి శ్రీకారం చుట్టనున్నారు.