Page Loader
Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా
కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా

Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన జైలు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను చేపట్టిన ఆందోళన కారణంగా జైలు పాలయ్యానని, అప్పట్లో తనపై కఠినంగా వ్యవహరించారని తెలిపారు. శనివారం డెర్గావ్‌లోని లచిత్ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవంలో ఆయన తన విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకున్నారు. అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి నిరసన వ్యక్తం చేశామన్నారు. దాంతో తనను 7 రోజుల పాటు జైలులో ఉంచి, భౌతికంగా దాడి చేశారని అమిత్ షా వెల్లడించారు. హితేశ్వర్ సైకియా కాంగ్రెస్ తరఫున రెండు సార్లు అస్సాం సీఎంగా పనిచేశారు.

Details

హిమంత బిశ్వ శర్మకు  కృతజ్ఞతలు 

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో శాంతి నెలకొల్పడంలో విఫలమైందని అమిత్ షా విమర్శించారు. అయితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భద్రత మెరుగైందని, గత 10 ఏళ్లలో 10 వేల మంది యువకులు ఆయుధాలను వదిలి సామాజిక జీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. ఈ సందర్భంగా, లచిత్ బర్ఫుకాన్ పోలీసు అకాడమీకి ఆ మహా యోధుని పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు అమిత్ షా కృతజ్ఞతలు తెలియజేశారు. మొఘలుల సామ్రాజ్యాకాంక్షను అణచివేసిన వీరులలో లచిత్ బర్ఫుకాన్ ఒకరని, ఆయన చరిత్రను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని హోంమంత్రి పేర్కొన్నారు.