LOADING...
Congress: కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు 
కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు

Congress: కాంగ్రెస్‌ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమైన మార్పులు చేస్తూ, టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)లో పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే టీపీసీసీలో ఐదు ప్రత్యేక కమిటీలను ప్రకటించిన తర్వాత, తాజాగా మరో దశగా 27 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల ప్రక్రియకు ముగింపు లభించింది.

వివరాలు 

జాబితాను ప్రకటించిన కేసీ వేణుగోపాల్

తాజా జాబితాను కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. ఈ మార్పులు, నియామకాలు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు చేపట్టినవే. ఖర్గే ఆదేశాలను అనుసరిస్తూ, కేసీ వేణుగోపాల్ ఈ జాబితాను ప్రకటించారు. ఇందులో రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా స్థానం పొందారు. దీని ద్వారా పార్టీ నిర్మాణం మరింత బలపడే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

టీపీసీసీ ఉపాధ్యక్షులు వీరే.. 

టి. కుమార్‌ రావు టి.రఘువీర్‌ రెడ్డి (ఎంపీ) నాయిని రాజేందర్‌ రెడ్డి(ఎమ్మెల్యే) డా.చిక్కుడు వంశీకృష్ణ (ఎమ్మెల్యే) బల్మూర్‌ వెంకట్‌ (ఎమ్మెల్సీ) బసవరాజు సారయ్య (ఎమ్మెల్సీ) హనుమాండ్ల ఝాన్సీరెడ్డి బండి రమేశ్‌ కొండూరు పుష్పలీల కోట నీలిమ బి.కైలాశ్‌ కుమార్‌ ఎన్‌. శ్రీనివాస్‌ ఆత్రం సుగుణ గాలి అనిల్‌ కుమార్‌ చిట్ల సత్యనారాయణ లకావత్‌ ధన్వంతి ఎం.వేణు గౌడ్‌ కోటింరెడ్డి వినయ్ రెడ్డి కొండేటి మల్లయ్య ఎంఏ ఫహీం (సంగారెడ్డి) ఎస్‌.సురేష్‌ కుమార్‌ బొంతు రామ్మోహన్‌ అఫ్సర్‌ యూసఫ్‌ జాహీ నవాబ్‌ ముజాహిద్‌ ఆలం ఖాన్‌ గుమ్ముల మోహన్‌ రెడ్డి సీహెచ్‌. సంగమేశ్వర్‌

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వీరే..