Page Loader
Congress Committees: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన

Congress Committees: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పీసీసీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ వేగవంతం చేసింది. ఎట్టకేలకు ఏఐసీసీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌) తెలంగాణ పీసీసీలో ఐదు కీలక కమిటీలను ప్రకటించింది. ఈ కమిటీల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని పార్టీలో మరింత స్థిరత్వం, సజావుగా నిర్వహణ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు ఇవే: 1. పోలిటికల్ అఫైర్స్ కమిటీ - 22 మంది సభ్యులు 2. అడ్వైజరీ కమిటీ - 15 మంది 3. డీలిమిటేషన్ కమిటీ - 7 మంది 4. సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ - 16 మంది 5. క్రమశిక్షణ చర్యల కమిటీ - 6 మంది

Details

 పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు

పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికార కలిగిన ఈ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, **పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇతర సభ్యులుగా చల్లా వంశీచంద్ రెడ్డి, రేణుక చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, పి. సుదర్శన్ రెడ్డి, బీర్ల ఐలయ్య, జెట్టి కుసుమ్ కుమార్, ప్రేమ్ సాగర్ రావు, ఈరవత్రి అనిల్ కుమార్ ఉన్నారు. క్యాబినెట్ మంత్రులందరినీ స్పెషల్ ఇన్వైటీస్‌గా ఈ కమిటీలో చేర్చారు.

Details

అడ్వైజరీ కమిటీ సభ్యులు

మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, వి. హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, జఫ్ఫార్ జావేద్, జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్. క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ : మల్లు రవి వైస్ చైర్మన్ : శ్యామ్ మోహన్ సభ్యులు: ఎం. నిరంజన్ రెడ్డి, బి. కమలాకర్ రావు, జఫ్ఫార్ జావిద్, జీవి రామకృష్ణ ఈ ప్రకటనతో కాంగ్రెస్‌ పునర్వ్యవస్థీకరణ దిశగా కీలక అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. పీసీసీకి పునర్నిర్మాణం, సమీకరణ ప్రక్రియ వేగవంతం కావడం పట్ల కార్యకర్తల్లో చైతన్యం నెలకొననుంది.