Page Loader
Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?
తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?

Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
08:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూన్ తొలి వారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశముంది. ఈ క్రమంలో పలువురు కొత్త నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాస్ కు ఈసారి మంత్రిగా అవకాశం దక్కనుంది. ఆయనతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా క్యాబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్నారని సమాచారం. వీరికి అధికార పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. అలానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి మంత్రిపదవి లభించే అవకాశముంది.

Details

కొండాను తప్పించే అవకాశం

అయితే తరచూ వివాదాల్లో నలిగిపోతున్న వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖను ఈసారి మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు సమాచారం. ఆమె సామాజికవర్గం నుంచి వచ్చిన ఆది శ్రీనివాస్‌కు స్థానం కల్పించి సామాజిక సమీకరణాన్ని సాధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నప్పటికీ, ఇందులో నాలుగు బెర్తులనే భర్తీ చేయనున్నారని ప్రచారం సాగుతోంది. మాల, మాదిగ వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఈసారి ఈ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని అధిష్టానం తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ విస్తరణ కోసం దాదాపు ఏడాదిన్నరగా ఆశావహ నేతలు ఎదురుచూస్తున్నారు.

Details

కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలు

ఇప్పటి వరకు అనేకసార్లు సమీక్షలు, సంప్రదింపులు జరిగినప్పటికీ, సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడం, కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు పార్టీ హైకమాండ్ తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే గతంలో పెండింగ్‌లో ఉన్న పార్టీకమిటీలకు కూడా హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు ఖాళీలకు 12 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారు. గతంలో హామీలు పొందిన నేతలు, సీనియర్ లీడర్లు పదవుల కోసం పోటీపడుతున్నారు. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఎంపికలు జరగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.