
Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో పాక్‌తో తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ లోని కొంతమంది నేతలు సమర్థిస్తుండగా, మరికొంతమంది మాత్రం ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ మోదీ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
1971 యుద్ధ సందర్భంలో ఇందిరా గాంధీ భారత సైనికులతో కలిసి దిగిన చారిత్రక ఫోటోలను హస్తం పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నేటి పరిస్థితులతో పోల్చుతున్నారు.
Details
ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
'ఇందిర ధైర్యంగా వ్యవహరించారు. దేశ రక్షణ కోసం రాజీ పడలేదు. ఆమె లేని లోటు కనిపిస్తోందంటూ నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.
'జాతి పౌరుషాన్ని కాపాడిన నేత'గా ఆమెను ప్రశంసిస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపింది.
ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
పార్లమెంటులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, జరిగిన పరిణామాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Details
మోదీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, "అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన వెంటనే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
దేశ ప్రజలు అనేక విషయాలపై స్పష్టత కోరుతున్నారు. వాటిపై పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి చర్చ జరగాలని కోరారు.
ఈ పరిణామాలతో, పాక్‌తో సంబంధాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వివిధ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
చరిత్రను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు, వ్యతిరేకతా స్వరాలు వినిపిస్తున్నాయి.