
Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్ బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రదాడుల విషయంలో భారత్ మౌనంగా ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్‌పై విషం చిమ్మిస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు, ఆయన నేతృత్వంలోని బృందం అమెరికా వెళ్లింది.
ఈ సందర్బంగా న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను సందర్శించిన అనంతరం శశిథరూర్ మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదం ప్రపంచానికి ఒక పెద్ద సమస్య. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం భారత కాన్సులేట్‌లో జరిగిన సమావేశంలో, భారత్ ఉగ్రవాదంపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.
Details
పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర స్పందన
శశిథరూర్ మాట్లాడుతూ పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రదాడి జరిగినట్లు గుర్తుచేశారు.
'ఈ దాడి వెనుక ఉద్దేశం భారత్‌లో మత సంఘర్షణలు రెచ్చగొట్టడమే. ఈ దాడిని 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' అనే ఉగ్రవాద సంస్థ నిర్వహించింది. ఇది లష్కరే తయ్యిబాకు అనుబంధంగా ఉంది.
ఈ సంస్థను ఐరాస ఉగ్రసంస్థగా ప్రకటించాలంటూ భారత్ ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని తెలిపారు.
తాను ప్రభుత్వంలో లేని ప్రతిపక్ష నేత అయినా, ఈ దాడిపై పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యాసం రాశానని శశిథరూర్ పేర్కొన్నారు.
భారత్ ఈ దాడికి సైనిక స్థాయిలో ప్రతీకారం తీర్చుకుందని వివరించారు.
Details
భారత్ సైన్యం కచ్చితమైన దాడులు
పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది.
పాక్ సైన్యం ప్రతిదాడికి దిగినప్పటికీ, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.
ఈ ఆపరేషన్‌తో భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించదనే గట్టి సందేశం పంపిందని శశిథరూర్ వివరించారు.