Page Loader
YS Sharmila: నా ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు : షర్మిల సంచలన ఆరోపణలు
నా ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు : షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: నా ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు : షర్మిల సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరగడం పచ్చినిజమని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌తో పాటు భర్త, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్‌ చేశారంటూ ఆరోపణలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ఖచ్చితమైన నిర్ధారణ ఉందని వెల్లడించారు. 'నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం వైవీ సుబ్బారెడ్డి నాకు స్వయంగా చెప్పారు. అప్పట్లో నేను మాట్లాడిన ఓ ఆడియోను ఆయన నన్ను వినిపించారు. ఆ ఆడియో విని షాక్ అయ్యాను. దీంతో కచ్చితంగా ట్యాపింగ్ జరిగింది అనే నిర్ధారణకు వచ్చానని షర్మిల స్పష్టం చేశారు.

Details

విచారణకు సిద్ధమే 

'ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైనా విచారణ జరిపితే, ఏదైనా కమిషన్ ముందుకెళ్లమనితే, నేను తప్పకుండా హాజరవుతాను. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేయాలి. న్యాయం జరిగేలా చూడాలని షర్మిల కోరారు. 'జగన్, కేసీఆర్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తే.. రక్త సంబంధాలు కూడా బలహీనంగా కనిపించాయి. నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణిచేందుకు వారిద్దరూ కలిసి స్కెచ్ వేశారు. కేసీఆర్ కోసం జగన్ నన్ను పూర్తిగా తొక్కిపెట్టాలని చూశారు. నాకు మద్దతుగా ఉన్నవారిని బెదిరించారు. నా ఎదుగుదలపై శాపంలా మారారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్‌కు సంబంధం లేదన్నా, నన్ను నాశనం చేయాలన్న కుతంత్రానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Details

నన్ను అడ్డుకునేందుకే కుట్రలు 

'నా చుట్టూ పరిస్థితులను గందరగోళంగా చేసి, నా ప్రతి ఉద్యమానికి అడ్డుపడ్డారు. రాజకీయంగా నేను ఎదగకుండా, నా భవిష్యత్తును పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రలో ఫోన్ ట్యాపింగ్ చిన్న అంశమే. అప్పుడు జగన్-కేసీఆర్‌లు చేసిన అణచివేతలు మరింత దారుణమని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం షర్మిల వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ దుమారం రేపుతున్నాయి.