Page Loader
Priyanka Gandhi: చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్
చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్

Priyanka Gandhi: చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) తీవ్రంగా విమర్శించారు. చర్చలను ఏలాగైనా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలు రచిస్తోందని ఆరోపించారు. పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడిన ప్రియాంకా.. ప్రజాస్వామ్య ప్రక్రియను కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలను గమనిస్తున్నా. ఏవిధంగానైనా చర్చలను అడ్డుకోవడమే వారి వ్యూహంగా కనిపిస్తోందన్నారు.

Details

విపక్ష నేతలను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు

ప్రతిపక్షాలు ఏ అంశంపై నిరసనలు తెలపినా వారిని రెచ్చగొట్టడం, విపక్ష నేతలను మాట్లాడకుండా అడ్డుకోవడం కొనసాగుతోందని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ఎంపీల సమక్షంలో పార్లమెంటు కార్యకలాపాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో కొనసాగించకుండా కేంద్రం అడ్డుకోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అభివర్ణించారు.