LOADING...
Naveen Yadav: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముందంజ 
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముందంజ

Naveen Yadav: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముందంజ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు దశల వారీగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగిస్తున్నారు. తొలి రౌండ్‌లో ఆయనకు 8,926 ఓట్లు నమోదయ్యాయి, కాగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు పొందారు. దీంతో మొదటి రౌండ్‌ ముగిసే సరికి నవీన్‌ యాదవ్‌ 62 ఓట్ల తేడాతో ముందంజలో నిలిచారు. రెండో రౌండ్‌లోనూ ఇదే ధోరణి కొనసాగింది.

Details

1,144 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్

ఈ రౌండ్‌లో నవీన్‌ యాదవ్‌ 9,691 ఓట్లు సాధించగా, మాగంటి సునీతకు 8,609 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి మొత్తం 18,617 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మొత్తం 17,473 ఓట్లు పొందారు. దీంతో ప్రస్తుతానికి నవీన్‌ యాదవ్‌ 1,144 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.