Page Loader
Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్
ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్

Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్‌లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చే మిషన్‌లో అమెరికా సీఐఏకు సహకరించిన పాకిస్తాన్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీపై పాకిస్థాన్ తీసుకున్న కఠిన వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా విమర్శించారు. అఫ్రీదీని విడుదల చేయాలన్న అమెరికా శాసనసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్‌ డిమాండ్‌ సముచితమని పేర్కొన్నారు. అఫ్రీదీ విడుదల జరిగితే 9/11 నాటి ముంబయి ఉగ్రదాడుల బాధితులకు న్యాయం జరిగేందుకు ఇది కీలక ముందడుగు అవుతుందని శశి థరూర్ అభిప్రాయపడ్డారు.

Details

డాక్టర్ అఫ్రీదీకి న్యాయం చేయాలి

తాజాగా ఎక్స్‌లో (ట్విట్టర్‌లో) స్పందించిన శశి థరూర్, "బ్రాడ్ షెర్మన్ డిమాండ్‌కు మేము మద్దతు ఇస్తున్నాం. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చింది. అతని నివాసం సమాచారాన్ని బయటపెట్టినందుకే ఓ వైద్యుడిని అక్రమంగా అరెస్టు చేసి శిక్షిస్తున్నారు. అదే వ్యక్తి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉంటే బహుమతులు వచ్చేవి. కానీ నిజాయితీగా వ్యవహరించినందుకు శిక్ష పడుతోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇటీవలే పాక్ సైన్యాధ్యక్షుడిగా ఉన్న జనరల్ ఆసిం మునీర్‌కు 'ఫీల్డ్ మార్షల్' హోదా ఇచ్చిన అంశాన్ని పరోక్షంగా విమర్శించారు. శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంది.

Details

2011 ఆఫ్రీది అరెస్టు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వివరించేందుకు ఈ పర్యటన చేపట్టారు. శనివారం జరిగిన సమావేశంలో బ్రాడ్ షెర్మన్ డాక్టర్ అఫ్రీదీ అంశాన్ని ప్రస్తావించారు. డాక్టర్ షకీల్ అఫ్రీదీ 2011లో సీఐఏకు సహకరించి ఒసామా బిన్ లాడెన్‌ను అబొట్టాబాద్ మిలిటరీ కంటోన్మెంట్‌లో గుర్తించేందుకు కీలకంగా పనిచేశారు. ఆయన ద్వారా లాడెన్ కుటుంబసభ్యుల డీఎన్‌ఏ నమూనాలు సేకరించబడ్డాయి. టీకా కార్యక్రమం రూపంలో జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం, అమెరికా తన స్పెషల్ ఫోర్సెస్‌తో లాడెన్‌ను హతమార్చింది. ఈ సహకారం ఇచ్చినందుకే అఫ్రీదీని 2011లో అరెస్టు చేసిన పాకిస్థాన్, 2012లో 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.