LOADING...
AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్
ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్

AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఫలితంగా ఏపీలో జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. ఈ మార్పులకు సంబంధించిన తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఎల్లుండి విడుదల చేయనున్నారు.

Details

మదనపల్లె జిల్లాలో రాయచోటి   

మంత్రివర్గ నిర్ణయం ప్రకారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాలో, రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపనున్నారు. అలాగే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయనున్నారు. ఇదే సమావేశంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement