Chandrababu: ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో నేడు చంద్రబాబు కీలక సమావేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ఈ భేటీల్లో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, అలాగే కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహకారం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్కు కావాల్సిన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులను ఏపీ రాజధాని అమరావతితో అనుసంధానం చేసే రహదారి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ కీలక సమావేశాలను నిర్వహిస్తున్నారని సమాచారం.
వివరాలు
సీఎం చంద్రబాబు నేటి ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
ఉదయం 9.45 గంటలకు - శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో భేటీ ఉదయం 10.45 గంటలకు - కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశం ఉదయం 11.30 గంటలకు - పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ మధ్యాహ్నం 12.15 గంటలకు - షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశం మధ్యాహ్నం 2.15 గంటలకు - తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగే "రియల్ ఎస్టేట్ అవార్డు ప్రదానోత్సవం"లో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటలకు - పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరితో భేటీ
వివరాలు
సీఎం చంద్రబాబు నేటి ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
సాయంత్రం 5.30 గంటలకు - కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం ఈ భేటీల ద్వారా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.