LOADING...
Harry Brook: 'సంజూ క్యాచ్ వదిలేశా.. మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది' : బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు!
'సంజూ క్యాచ్ వదిలేశా.. మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది' : బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు!

Harry Brook: 'సంజూ క్యాచ్ వదిలేశా.. మ్యాచ్ అక్కడే మలుపు తిరిగింది' : బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని వాంఖడే స్టేడియం గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఇండియా క్రికెట్ జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్ కూడా చివరి వరకు ధైర్యంగా పోరాడినా కేవలం 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఓటమికి తానే బాధ్యుడినని స్పష్టం చేస్తూ బాధ్యతను తనపై తీసుకున్నాడు. ముఖ్యంగా భారత బ్యాటర్ సంజు శాంసన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను తాను వదిలేయడం మ్యాచ్ మలుపు తిరిగిన కీలక క్షణమని బ్రూక్ అంగీకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన పొరపాటును నిజాయితీగా ఒప్పుకున్నాడు.

Details

ఈ మ్యాచులో అదృష్టం కలిసి రాలేదు

సాధారణంగా క్యాచ్‌లు మిస్ చేయకుండా పట్టిన జట్టే మ్యాచ్ గెలుస్తుందని క్రికెట్‌లో చెప్పే మాట నిజమేనని, అయితే ఈ మ్యాచ్‌లో అదృష్టం తమవైపు నిలవలేదని వ్యాఖ్యానించాడు. ఫీల్డింగ్‌లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలే చివరికి జట్టుకు భారీ నష్టాన్ని తెచ్చాయని తెలిపాడు. ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం గురించి కూడా బ్రూక్ వివరణ ఇచ్చాడు. పిచ్ తాజాగా ఉండటంతో ప్రారంభంలో బౌలర్లకు కొంత సహాయం ఉంటుందని భావించాం. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం ఉండొచ్చని అనుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాం. అయితే పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది. భారత్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోయారు.

Details

భారత ఆటగాళ్లు అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు

ప్రపంచ స్థాయి బ్యాటర్ల ఎదుట చిన్న పొరపాటు చేసినా బంతి వెంటనే బౌండరీ దాటుతుంది. భారత్ ఆటగాళ్లు అలాంటి అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారని బ్రూక్ వెల్లడించాడు. ఇక ఇంగ్లండ్ తరఫున జాకబ్ బెతల్ అద్భుతంగా పోరాడిన విషయాన్ని కూడా బ్రూక్ ప్రస్తావించాడు. ధైర్యంగా ఆడుతూ వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ జట్టును పోటీలో నిలిపాడని ప్రశంసించాడు. బెథెల్ ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. భవిష్యత్తులో ఇంగ్లాండ్ జట్టుకు అతడు కీలక ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకం వ్యక్తం చేశాడు. మొదటి బంతి నుంచే ధైర్యంగా ఆడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించాడని బ్రూక్ పేర్కొన్నాడు.

Advertisement