LOADING...
Chandrababu: అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు
అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు

Chandrababu: అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు వైసీపీ (YSRCP) కుట్రలు పన్నుతోందని టీడీపీ (TDP) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే ఆ పార్టీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో వైకాపా నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని, రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము చేసిన పాపాల నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Details

అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టి అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే విషయం వైకాపా నేతలకు నచ్చడం లేదని, అందుకే అభివృద్ధిని అడ్డుకునేందుకు వారు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు తప్పనిసరిగా సంయమనం పాటించేలా మంత్రులు, పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ వేసిన ట్రాప్‌లో పడవద్దని, అలా జరగకుండా నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement