LOADING...
Andhrapradesh: బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు
బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

Andhrapradesh: బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ సెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు ఈ స్టాళ్లు కొనసాగనున్నాయి. వీటిలో పొందూరు చొక్కాలు, పంచెలు, కండువాలు, అలాగే మాధవవరం, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన చీరలు సహా పలు చేనేత ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తదితరులు చేనేత ప్రదర్శనలను సందర్శించిన సందర్భాలను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీలతో ప్రత్యేక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో వస్త్రాలను 40 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. చీరల ధరలు రూ.800 నుండి రూ.26,000 వరకు ఉన్నాయి.

వివరాలు 

చేనేత వస్త్రాలను కొనుగోలు చేయండి..

చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభ సభ్యులను కోరారు. బుధవారం మంత్రి సవిత ఈ స్టాళ్లను సందర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా నేతన్నలకు ఆర్థికంగా మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement