CM Chandrababu: యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికమంత్రి అల్ మార్రీతో సమావేశమయ్యారు. ఈభేటీలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుతో పాటు,ఆంధ్రప్రదేశ్-యూఏఈ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈతో కలిసి పని చేయాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. యూఏఈకి చెందిన సుమారు 40కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందిస్తామని అల్ మార్రీ తెలిపారు. అదేవిధంగా ఆహార భద్రత,లాజిస్టిక్స్,పోర్టు ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది. అలాగే పునరుత్పాదక ఇంధనం,పట్టణాభివృద్ధి,మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులపై ఉన్న అవకాశాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రితో చంద్రబాబు సమావేశం
దావోస్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్… pic.twitter.com/WECLFF6LCo
— Telugu Desam Party (@JaiTDP) January 20, 2026