తదుపరి వార్తా కథనం
Chandrababu: చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 18, 2025
12:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆయనను 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. వ్యాపార, ఆర్థిక రంగాల్లో విశేష అనుభవం కలిగిన ప్రముఖులతో కూడిన జ్యూరీ చంద్రబాబు నాయుడిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా లోకేష్ చేసిన ట్వీట్
A moment of pride for our family and for Andhra Pradesh. Hon’ble CM Shri @ncbn Garu honoured as ‘Business Reformer of the Year’ by @EconomicTimes. Few leaders have shaped India’s reform journey with such clarity, courage and consistency. This award is a tribute to his unwavering… pic.twitter.com/F8uE6ZafnN
— Lokesh Nara (@naralokesh) December 18, 2025