Chandrababu Family: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, అలాగే బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. అలాగే పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో దేవాంశ్ పాల్గొనగా, ఆ పోటీలను సీఎం చంద్రబాబు సహా కుటుంబసభ్యులు ఆసక్తిగా తిలకించారు.
Details
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
వేడుకలకు ముందుగా, గ్రామస్తులు సమర్పించిన వినతిపత్రాలను సీఎం చంద్రబాబు స్వీకరించారు. ఇక నేడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు స్వగ్రామంలోనే సీఎం బస చేయనున్నారు.