Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 13, 2026
11:19 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈకేసును రద్దు చేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు,పేర్ని నానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయనపై నమోదు అయిన ఆరోపణలు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవని పేర్కొన్న కోర్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3)నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.అలాగే తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.