LOADING...
Cm chandrababu: గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్
ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్

Cm chandrababu: గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

గిరిజన ప్రాంతాల్లో ఎకోటూరిజం పార్కుల ఏర్పాటులో తమారా లీజర్‌ సంస్థ ఆసక్తి చూపినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఉన్నందున,ఈ రంగంలో పెట్టుబడుల కోసం ఉన్న విస్తృత అవకాశాలను పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. దావోస్ పర్యటనలో భాగంగా, తమారా లీజర్‌ సీఈఓ సృష్టి శిబులాల్‌తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుపై సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

వివరాలు 

ప్రతి పర్యాటక కేంద్రానికి రోడ్లు,విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి

"రాష్ట్రంలో ఇప్పటికే పర్యాటక కేంద్రాలు ఉన్నా,పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో కొత్త పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే పెద్ద అవకాశాలు ఉన్నాయి. కోనసీమ,గండికోట, అరకు,లంబసింగి వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చు.ప్రతి పర్యాటక కేంద్రానికి రోడ్లు, విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి.హోటల్ రంగానికి మేము ప్రోత్సాహం అందిస్తున్నాం. ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది" అని సమావేశంలో సీఎం పేర్కొన్నారు.

వివరాలు 

కమ్యూనిటీ ఫస్ట్

సృష్టి శిబులాల్ మాట్లాడుతూ, విశాఖ, ఇతర ప్రాంతాల్లో హోమ్‌స్టే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు తమ ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. అలాగే, "కమ్యూనిటీ ఫస్ట్" అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు నేర్పేందుకు సంస్థ సిద్ధంగా ఉందని ప్రతినిధులు సీఎం ముందు వివరించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు అంగీకరించిన తమారా లీజర్

Advertisement