Abdul Qadir: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ లెజండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామాన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు సులామాన్‌ను అరెస్ట్ చేశారు. పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసి, తనను సులామాన్ బలవంతంగా ఫామ్‌హౌజ్‌లోకి తీసుకెళ్తూ అత్యాచారం చేశాడని తెలిపారు. మహిళ ఫిర్యాదు తర్వాత వైద్య పరీక్షలకు పంపడం, తరువాత తాను ఎదుర్కొన్న లైంగిక దాడి జరిగిందో లేదో నిర్ధారణ చేయాలని పోలీసులు వెల్లడించారు.
Details
పాక్ తరుపున 67 టెస్టులు
41 ఏళ్ల సులామాన్ 2005 నుండి 2013 మధ్య 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడి తండ్రి అబ్దుల్ ఖాదిర్ పాక్ తరపున ప్రసిద్ధ స్టార్ క్రికెటర్. పాక్ తరపున 67 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1980లలో లెగ్ స్పిన్ బౌలింగ్‌లో అత్యంత ప్రసిద్ధిగా గుర్తింపు పొందాడు. సెప్టెంబర్ 2019లో ఖాదిర్ మరణించారు.