India Vs Pakistan: టీ20ల్లో భారత్-పాక్ మధ్య మర్చిపోలేని చారిత్రాత్మక ఘట్టాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు అనగానే అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. అన్ని ఫార్మాట్లలోనూ ఇరు జట్లు ఎన్నో మరపురాని మ్యాచులు జరిగాయి. 1947 విభజన అనంతరం ఉద్భవించిన చారిత్రక, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు పొరుగు దేశాల మధ్య క్రికెట్ పోరు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లన్నీ హై వోల్టెజ్‌లో జరగనున్నాయి. అయితే రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చని సంకేతాలు వెలువడ్డాయి.
Details
ఫిబ్రవరి 15న భారత్, పాక్ మ్యాచ్
ఫిబ్రవరి 15న డిఫెండింగ్ చాంపియన్లైన భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే మళ్లీ ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో పీసీబీ మ్యాచ్ జరగడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో టీ20 అంతర్జాతీయాల్లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న కొన్ని తీవ్ర సంఘటనలు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి.
Details
చెయ్యి కలపని సూర్యకుమార్
2025 ఆసియా కప్ సందర్భంగా భారత్-పాక్ జట్లు తలపడిన మూడు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా షేక్ హ్యాండ్ చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేయకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సంబంధాలు మరింత దిగజారడం నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే టోర్నీలో ఆసియా కప్ ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి స్వీకరించడాన్ని కూడా భారత్ నిరాకరించడం మరింత చర్చనీయాంశమైంది. ఇలా క్రికెట్ మైదానంలోనూ, మైదానం వెలుపలనూ భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.