LOADING...
IND vs PAK : భారత్ చేతిలో ఘోర ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ ప్లేయర్లు చేసిన పని ఇదే!
భారత్ చేతిలో ఘోర ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ ప్లేయర్లు చేసిన పని ఇదే!

IND vs PAK : భారత్ చేతిలో ఘోర ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో పాక్ ప్లేయర్లు చేసిన పని ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. 61 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో పాక్ జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు తీవ్రంగా బాధపడుతున్నారని పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ వెల్లడించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

Details

 డ్రెస్సింగ్ రూమ్ మొత్తం నిరాశలో ఉంది

టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. మ్యాచ్ అనంతరం హెస్సన్ మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూమ్ మొత్తం నిరాశలో ఉంది. భారత్‌తో మ్యాచ్ ఎంత ముఖ్యమో ఆటగాళ్లకు బాగా తెలుసనని వ్యాఖ్యానించాడు. ఇక ప్రేమదాస స్టేడియంలో గత మూడు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచిన నేపథ్యంలో తాము బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలో బంతి బాగా తిరుగుతుందని భావించామని, తమ బౌలర్లు ఇన్నింగ్స్‌ను బాగానే ప్రారంభించారని తెలిపాడు. అయితే ఇషాన్ కిషన్ ఆ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడని అంగీకరించాడు.

Advertisement