ICC Mens T20 World Cup: ఆ నిర్ణయం మా చేతుల్లో లేదు.. ప్రభుత్వ ఆదేశాలే కీలకం: సల్మాన్ అలీ అఘా
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) 2026లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను పాకిస్థాన్ మాత్రం వెల్లడించలేదు. ఈ విషయంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన స్పందనను వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సల్మాన్ అలీ అఘా చెప్పారు. మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లేదు. మేము ఏమీ చేయలేము. మా ప్రభుత్వం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాల్ని పాటించాల్సి ఉందన్నారు.
Details
పాక్ పై చర్యలు తీసుకొనే అవకాశం
ప్రస్తుతం PCB అధికారికంగా ఈ మ్యాచ్ బహిష్కరణ విషయాన్ని ఐసీసీకి తెలియజేయలేదు. అయితే సోమవారం ఐసీసీ సమావేశం జరగనుండగా, పాక్‌పై చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం వస్తోంది. తపాక్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో పాల్గొనే విదేశీ క్రికెటర్లు ఇతర బోర్డుల నుండి నిరభ్యంతర పత్రాలు పొందడంలో సమస్యలు ఎదుర్కోవచ్చు. అదనంగా ఐసీసీ టోర్నమెంట్లను నిర్వహించే హక్కులను కోల్పోవడం, ప్రతి సంవత్సరం ఐసీసీ నుండి పొందే రెవెన్యూ వాటాలు ఆగిపోవడం వంటి పరిణామాలు ఉండే అవకాశముంది. అయితే, పాక్ తమతో మ్యాచ్‌ను బహిష్కరించినా, భారత్ షెడ్యూల్ ప్రకారం శ్రీలంకకు చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననుంది. ఈ విషయంపై బీసీసీఐ (BCCI) ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.