LOADING...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి కపిల్‌దేవ్, గావస్కర్ విజ్ఞప్తి
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి కపిల్‌దేవ్, గావస్కర్ విజ్ఞప్తి

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. పాక్ ప్రభుత్వానికి కపిల్‌దేవ్, గావస్కర్ విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన కుడి కన్ను చూపులో సుమారు 85 శాతం వరకు కోల్పోయినట్లు సమాచారం వెలువడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు 14 మంది ప్రముఖ క్రికెటర్లు సంతకాలు చేసిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

Details

జైలు సిబ్బంది అమానవీయంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణ

సంతకదారుల్లో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు. వీరితో పాటు మాజీ కెప్టెన్లు మైఖేల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రెయర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ కూడా ఉన్నారు. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైలులో ఉన్నారు. అక్కడ జైలు సిబ్బంది ఆయనపై అమానవీయంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైలు గదిలో సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కంటి చూపు దెబ్బతిందని సమాచారం.

Details

ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు

ఈ విషయాలు పాక్ సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ వెంటనే ఇమ్రాన్ ఖాన్‌కు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే పాకిస్థాన్ జట్టు 1992లో ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement