India vs Pakistan Weather Report: కొలంబోలో భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
కొలంబోలో ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ, వర్షంఅడ్డంకిగా మారే అవకాశం ఉంది. టోర్నీ ఇంకా ఆరంభంలోనే ఉన్నప్పటికీ పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది. భారత్, పాకిస్థాన్ రెండూ రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్‌తో భారత్ ముందంజలో ఉంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో 50 నుంచి 65శాతం వరకు వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉండటంతో ఆటకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
వివరాలు
కొలంబో మైదానం స్పిన్నర్లకు అనుకూలం
ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఇక పిచ్ విషయానికి వస్తే, కొలంబో మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్లు స్పిన్ బౌలింగ్‌పై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి,అక్షర్ పటేల్ కీలకంగా మారవచ్చని అంచనా. మరోవైపు పాకిస్థాన్ దగ్గర అబ్రార్ అహ్మద్,షాదాబ్ ఖాన్,మొహమ్మద్ నవాజ్‌లతో బలమైన స్పిన్ దళం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ స్పిన్నర్లు, అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లోనూ రాణించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. "స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే విషయంలో భారత్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా, వర్షం ఎంతవరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.