LOADING...
Pak: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై పాక్ ఆందోళన.. భారత్‌పై ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై పాక్ ఆందోళన.. భారత్‌పై ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

Pak: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై పాక్ ఆందోళన.. భారత్‌పై ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన ఆయన, అణు ఒప్పందంపై చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్‌పై యుద్ధానికి దిగాయని ఆరోపించారు. ఈ పరిస్థితులు కొనసాగితే పాకిస్థాన్‌పైనా ప్రభావం పడే అవకాశముందని ఆయన తెలిపారు. ముఖ్యంగా తమ సరిహద్దుల వద్ద అస్థిర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వైపుల నుంచి శత్రువులు చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడితే పాకిస్థాన్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

జియోనిజం అనే యూదు భావజాలం..

అదే సమయంలో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిస్తే భారత్, అఫ్గానిస్థాన్ కలిసి పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆసిఫ్ అభిప్రాయపడ్డారు. అలాంటి పరిణామాలు తమ దేశానికి తీవ్ర సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను బలహీనపరిచి సామంత దేశంగా మార్చాలనే కుట్రలో ఇజ్రాయెల్ పాల్గొంటోందని, అందులో భారత్ కూడా భాగస్వామిగా ఉందని ఆయన ఆరోపించారు. ఇంకా 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచంపై ప్రభావం చూపిన అనేక ఘర్షణల్లో జియోనిజం అనే యూదు భావజాలం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర పోషించిందని ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా జియోనిస్టుల ప్రభావం కొనసాగుతోందని ఆయన అన్నారు.

Advertisement