LOADING...
Devajit Saikia: పాక్‌ మ్యాచ్‌పై సస్పెన్స్‌.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ
పాక్‌ మ్యాచ్‌పై సస్పెన్స్‌.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ

Devajit Saikia: పాక్‌ మ్యాచ్‌పై సస్పెన్స్‌.. ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు లేవు: బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. ఈ అంశంపై ఐసీసీ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Details

ఐదు వేదికల్లో మ్యాచులు జరగుతాయి

"ఇప్పటివరకు ఐసీసీ నుంచి మాకు ఎలాంటి సూచనలు రాలేదు. షెడ్యూల్‌ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం. భారత్‌లో జరగనున్న మ్యాచ్‌ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సైకియా తెలిపారు. టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌లో ఐదు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. కోల్‌కతా, ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌, చెన్నై వేదికలుగా ఎంపికైనట్లు చెప్పారు. ఈ అన్ని స్టేడియాల్లో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్నారు. భారత జట్టు తొలి మ్యాచ్‌ వివరాలపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.

Details

ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం

షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 7న ముంబయి వేదికగా భారత్‌, యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ఐసీసీ ప్రకటించిన వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని సైకియా తెలిపారు. పాకిస్థాన్‌ మ్యాచ్‌ బహిష్కరణ అంశంపై స్పందిస్తూ.. "ఎవరు ఆడతారు, ఎవరు ఆడరు అనే విషయం పూర్తిగా ఐసీసీ నిర్ణయంపై, అలాగే ఆయా దేశాల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ నుంచి అధికారిక ధ్రువీకరణ వచ్చే వరకు ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు.

Advertisement