LOADING...
T20 World Cup 2026: బ్రూక్‌ శతకం... సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్
బ్రూక్‌ శతకం... సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్

T20 World Cup 2026: బ్రూక్‌ శతకం... సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌ సూపర్‌ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకేసింది. సూపర్‌-8 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ శతక వీరుడిగా అవతరించిన మ్యాచ్‌లో ఆసక్తికర సమరంలో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఈ పరాజయంతో పాక్‌ టోర్నీలో అవకాశాలు దాదాపు ముగిసినట్టే అయ్యాయి. గ్రూప్‌లో టాప్‌-2 స్థానాన్ని నిర్ధారించుకోవడంతో ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరింది.

వివరాలు 

పల్లెకెలె:

కెప్టెన్‌ బ్రూక్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఫర్హాన్‌ (63; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకంగా రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో డాసన్‌ (3/24), ఒవర్టన్‌ (2/26), ఆర్చర్‌ (2/32) చక్కటి ప్రదర్శన చూపించారు. అనంతరం లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లాండ్‌ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి గెలుపు సాధించింది. బ్రూక్‌ (100; 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకం నమోదు చేశాడు. సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లాండ్‌కు ఇది రెండో విజయం. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా ఐదోసారి సెమీస్‌ చేరడం విశేషం.

వివరాలు 

అతడొక్కడు

లక్ష్య ఛేదనలో బ్రూక్‌ ఒక్కడే పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్‌కు తొలి బంతికే షాక్‌ తగిలింది. సాల్ట్‌ డక్‌ అయ్యాడు. తరువాత బట్లర్‌ (2), బెతెల్‌ (8) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ ఒత్తిడిలో పడింది. వికెట్లు వరుసగా పడుతున్నా బ్రూక్‌ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోరు ముందుకు నడిపించాడు. ఎనిమిదో ఓవర్లో 58 పరుగుల వద్ద బ్యాంటన్‌ (2) ఔటవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. అయినా బ్రూక్‌ పట్టుదలతో నిలిచాడు. సామ్‌ కరన్‌ (16)తో కలిసి స్కోరును 100 దాటించాడు. అయితే 12వ ఓవర్లో తారిఖ్‌ కరన్‌ను ఔట్‌ చేయడంతో భాగస్వామ్యం ముగిసింది.

Advertisement

వివరాలు 

అతడొక్కడు

ఆ సమయంలో పాక్‌కు మంచి అవకాశం లభించినట్టే కనిపించింది.కానీ బ్రూక్‌కు జాక్స్‌ అండగా నిలవడంతో ఇంగ్లాండ్‌ వేగం పెరిగింది. 48 బంతుల్లో 61 పరుగులు అవసరమైన దశ నుంచి చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులు అవసరమయ్యే స్థితికి చేరుకుంది. 17వ ఓవర్లో జాక్స్‌ ఫోర్‌ కొట్టగా,బ్రూక్‌ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాదుతూ 50 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. 19 బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో ఇంగ్లాండ్‌ గెలుపు సులభమని అనిపించింది. కానీ మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠ రేపింది. 17వఓవర్‌ చివరి బంతికి బ్రూక్‌ ఔటయ్యాడు. 18వ ఓవర్లో మీర్జా కేవలం 5 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో నవాజ్‌ 2 పరుగులే ఇచ్చి జాక్స్‌, ఒవర్టన్‌లను ఔట్‌ చేశాడు.

Advertisement

వివరాలు 

నిలిచిన ఫర్హాన్‌:

చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరమై, చేతిలో రెండు వికెట్లే మిగిలాయి. అయితే 20వ ఓవర్‌ తొలి బంతికే ఆర్చర్‌ ఫోర్‌ బాదడంతో ఇంగ్లాండ్‌ విజయోత్సాహంలో మునిగింది. అంతకముందు, బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌కు ఓపెనర్‌ ఫర్హాన్‌ బలమైన పునాది వేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌కు ఆరంభంలోనే ఇంగ్లాండ్‌ పేసర్లు దెబ్బతీశారు. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సయిమ్‌ అయూబ్‌ (7)ను ఆర్చర్‌, కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (5)ను ఒవర్టన్‌ ఔట్‌ చేశారు. ఆ సమయంలో ఫర్హాన్‌ బాధ్యత తీసుకున్నాడు. బాబర్‌ అజామ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తొలి పది ఓవర్లలో జాగ్రత్తగా ఆడిన ఫర్హాన్‌ తరువాత వేగం పెంచాడు.

వివరాలు 

నిలిచిన ఫర్హాన్‌:

బాబర్‌ నిలిచినా దూకుడు చూపలేకపోయాడు. 11వ ఓవర్లో ఒవర్టన్‌ బౌలింగ్‌లో బాబర్‌ బౌల్డ్‌ అయ్యే సరికి పాక్‌ స్కోరు 73. మూడో వికెట్‌కు 7.2 ఓవర్లలో 46 పరుగులు మాత్రమే జతచేశారు. ఫకార్‌ జమాన్‌ క్రీజ్‌లోకి వచ్చాక ఆటకు ఊపు వచ్చింది. జాక్స్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఫర్హాన్‌ కూడా అదే ఓవర్లో సిక్స్‌ కొట్టాడు. 16వ ఓవర్లో ఫర్హాన్‌ వరుసగా 6,4కొట్టినా అదే ఓవర్లో ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో జమాన్‌ కూడా వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ 30 బంతుల్లో 49 పరుగులు జోడించారు. చివరి మూడు ఓవర్లలో పాక్‌ 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేయగలిగింది. డాసన్‌,ఆర్చర్‌, సామ్‌ కరన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులను నియంత్రించారు.

వివరాలు 

ఇంగ్లాండ్‌ ముందంజ

గ్రూప్‌-2 నుంచి సెమీస్‌ బెర్తును ఇంగ్లాండ్‌ ముందుగానే ఖాయం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 4 పాయింట్లు సాధించింది.గ్రూప్‌లో మరో జట్టు మాత్రమే 4 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో ఇంగ్లాండ్‌ టాప్‌-2లో స్థానం దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఆ మ్యాచ్‌లో ఓడినా కనీసం రెండో స్థానంలో నిలుస్తుంది;గెలిస్తే అగ్రస్థానం దక్కుతుంది. బుధవారం న్యూజిలాండ్‌, శ్రీలంక మధ్య మ్యాచ్‌ కీలకం. లంక గెలిస్తే కివీస్‌,పాక్‌ జట్లు కూడా పోటీలో కొనసాగుతాయి. కివీస్‌-ఇంగ్లాండ్‌, పాక్‌-లంక మ్యాచ్‌ల ఫలితాలపై మరో సెమీస్‌ బెర్తు ఆధారపడి ఉంటుంది. కివీస్‌ చేతిలో ఓడితే లంక నిష్క్రమిస్తుంది. చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా కివీస్‌ లేదా పాక్‌లో ఒక జట్టు సెమీస్‌కు చేరుతుంది.

వివరాలు 

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌:

అయితే ఏ పరిస్థితుల్లోనూ కివీస్‌, పాక్‌, లంక జట్లలో ఒక్కటీ మాత్రమే 4కిపైగా పాయింట్లు సాధించగలవు. అందుకే ఇంగ్లాండ్‌కు సెమీఫైనల్‌ ప్రవేశం ముందుగానే ఖరారైంది. ఫర్హాన్‌ ఎల్బీ (బి)ఒవర్టన్‌ 63; సయిమ్‌ అయూబ్‌ (సి) బెతెల్‌ (బి) ఆర్చర్‌ 7; సల్మాన్‌ ఆఘా (సి) ఒవర్టన్‌ (బి) డాసన్‌ 5; బాబర్‌ అజామ్‌ (బి)ఒవర్టన్‌ 25; ఫకార్‌ జమాన్‌ (సి) డాసన్‌ (బి)అడిల్‌ రషీద్‌ 25; షాదాబ్‌ ఖాన్‌ రనౌట్‌ 23; ఉస్మాన్‌ఖాన్‌ (సి)ఒవర్టన్‌ (బి) డాసన్‌ 8; నవాజ్‌ ఎల్బీ (బి) డాసన్‌ 0; షహీన్‌ షా అఫ్రిది (సి) కరన్‌ (బి)ఆర్చర్‌ 2; సల్మాన్‌ మీర్జా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164;

వివరాలు 

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌:

సాల్ట్‌ (సి) ఉస్మాన్‌ ఖాన్‌ (బి) షహీన్‌ అఫ్రిది 0; బట్లర్‌ (సి) ఉస్మాన్‌ ఖాన్‌ (బి) షహీన్‌ అఫ్రిది 2; బ్రూక్‌ (బి) షహీన్‌ అఫ్రిది 100; బెతెల్‌ (సి) ఫర్హాన్‌ (బి) షహీన్‌ అఫ్రిది 8; బ్యాంటన్‌ (సి) ఉస్మాన్‌ ఖాన్‌ (బి) తారిఖ్‌ 2; సామ్‌ కరన్‌ (సి) నవాజ్‌ (బి) తారిఖ్‌ 16; జాక్స్‌ (బి) నవాజ్‌ 28; ఒవర్టన్‌ (స్టంప్డ్‌) ఉస్మాన్‌ ఖాన్‌ (బి) నవాజ్‌ 0; డాసన్‌ నాటౌట్‌ 1; ఆర్చర్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166;

Advertisement