Shahid Afrid: పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ పాకిస్థాన్ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ షాహిద్ అఫ్రిది టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ అంశంపై స్పందించారు. ఫిబ్రవరి 15న కోలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ఐసీసీ చర్యలకు నిరసనగా బహిష్కరిస్తుందని ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను అవకాశమిచ్చింది. దీనిపై పాక్ అసహనం వ్యక్తం చేస్తోంది. షాహిద్ అఫ్రిది తన ట్విట్టర్‌లో వివాదంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలి.
Details
వ
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడకపోవడం విచారకరమే. కానీ నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాను. ప్రతి క్రికెట్ బోర్డు నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయపరంగా ఉండాలి. ఇది నిరూపించుకోవడానికి ICCకి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అఫ్రిది వ్యాఖ్యల ద్వారా రాజకీయాల నుంచి క్రికెట్‌ను వేరు చేయాలని, నిష్పక్షపాత చర్యల ద్వారా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్రికెట్ అభిమానుల్లో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత పొందుతున్నాయి.