LOADING...
IND vs PAK: భారత్-పాక్ పోరు.. రికార్డు స్థాయిల్ వ్యూవర్‌షిప్‌!
భారత్-పాక్ పోరు.. రికార్డు స్థాయిల్ వ్యూవర్‌షిప్‌!

IND vs PAK: భారత్-పాక్ పోరు.. రికార్డు స్థాయిల్ వ్యూవర్‌షిప్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ పోరు మరోసారి క్రేజ్‌ను రుజువు చేసింది. టీమిండియా, పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించారు. మ్యాచ్ శ్రీలంకలో నిర్వహించబడటంతో భారత అభిమానులకు ప్రత్యక్షంగా స్టేడియానికి వెళ్లే అవకాశాలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ టీవీలు, ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్‌ను భారీ సంఖ్యలో వీక్షించారు. జియో అధికారిక లెక్కల ప్రకారం ఈ మ్యాచ్‌కు ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు తొమ్మిదిసార్లు తలపడ్డాయి.

Details

'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఇషాన్ కిషన్

అందులో భారత్ ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచింది. పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. తాజాగా కొలంబోలో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌కు ఓటమి తప్పలేదు. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించగా, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని అదుపులో పెట్టారు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా ఇషాన్ కిషన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. మ్యాచ్‌కు ముందు భారత్‌తో ఆడబోమని సంకేతాలు ఇచ్చిన పాకిస్థాన్, చివరకు ఐసీసీ ఆదేశాలు లేదా ఆర్థిక కారణాలు దృష్టిలో ఉంచుకుని పోరుకు అంగీకరించినట్లు ప్రచారం జరిగింది.

Details

సూపర్-8కి టీమిండియా అర్హత

అయితే ఈ ఓటమి తర్వాత పాక్ జట్టు తమ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడు విజయాలు సాధించి సూపర్-8 దశకు చేరుకుంది. అమెరికా, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లకూ విశేష స్పందన లభించింది. భారత్-అమెరికా పోరుకు 26 కోట్ల వ్యూస్, భారత్-నమీబియా మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చినట్లు జియోస్టార్ వర్గాలు వెల్లడించాయి. లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో ఆడనుంది.

Advertisement