LOADING...
India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో పిచ్‌ కీలక పాత్ర .. ఎవరికి అనుకూలమో తెలుసా?
భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో పిచ్‌ కీలక పాత్ర .. ఎవరికి అనుకూలమో తెలుసా?

India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో పిచ్‌ కీలక పాత్ర .. ఎవరికి అనుకూలమో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొలంబోలో జరగనున్న టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితాన్ని పిచ్ పరిస్థితులే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదాన స్వభావం అత్యంత కీలకంగా మారింది. ఇరు జట్ల కోచ్‌లు పిచ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడ స్పిన్నర్లకే ఎక్కువ మద్దతు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇక్కడ మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఆ మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 20 వికెట్లు స్పిన్నర్లకు దక్కగా, 21 వికెట్లు సీమర్ల ఖాతాలో పడ్డాయి. అయితే రన్‌రేట్‌ను నియంత్రించడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు.

Details

స్పిన్నర్లకు అనుకూలం

సీమర్లు వైవిధ్యమైన బంతులతో, ముఖ్యంగా స్లో డెలివరీలతో బౌలింగ్ చేస్తే ప్రభావం చూపే అవకాశం ఉంది. గత మూడు సంవత్సరాల్లో ఆర్. ప్రేమదాస్ స్టేడియంలో స్పిన్నర్లకు అనుకూలంగా వ్యవహరించింది. ఇటీవల జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల్లో ఇక్కడ సగటు రన్‌రేట్ 6.25 మాత్రమే నమోదైంది. పొట్టి ఫార్మాట్‌లో ఈ రన్‌రేట్ అంటే బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినట్టే. ఇక్కడ స్పిన్నర్ల సగటు సుమారు 16గా ఉండటం గమనార్హం.

Details

కొత్త పిచ్‌పై భారత్‌-పాక్‌ పోరు?

ఇటీవల ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం సాధించిన అదే పిచ్‌పై ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన పిచ్‌పైనే భారత్‌, పాక్ తలపడితే అది మరింత నెమ్మదించే అవకాశం ఉంది. కొలంబోలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో డ్యూ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆదివారం మ్యాచ్ సమయానికి ఆకాశం మేఘావృతంగా ఉండే సూచనలున్నాయి. దీంతో డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తుదిజట్ల ఎంపికలో వాతావరణం, పిచ్ స్వభావం కీలకంగా మారనున్నాయి. ఎక్కువమంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలా? లేక పేసర్లపై నమ్మకం ఉంచాలా? అన్నది మ్యాచ్‌కు ముందు నిర్ణయించాల్సిన ప్రధాన అంశంగా నిలిచింది.

Advertisement