LOADING...
India vs Pakistan: టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్‌-3 భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్‌-3 భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్‌-3 భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే కేవలం క్రికెట్‌ పోరాటమే కాదు.. భావోద్వేగాలు, చరిత్ర, ఉత్కంఠ అన్నీ కలిసిన ఓ పెద్ద ఈవెంట్‌. ఈ రెండు జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన ప్రతిసారి మ్యాచ్‌ రసవత్తరంగా మారిపోతుంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల చూపంతా అదే మ్యాచ్‌పై ఉంటుంది. రాజకీయ కారణాలతో రెండు జట్ల మధ్య సిరీస్‌లు దాదాపు లేకపోయినా, ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌-పాక్‌ పోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో నిలిచిపోయిన టాప్‌-3 భారత్‌-పాక్‌ మ్యాచ్‌లపై ఇప్పుడు ఒక్క లుక్ వేద్దాం.

#3

2007 డర్బన్‌ మ్యాచ్

గ్రూప్‌ దశలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 141 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినప్పటికీ రాబిన్‌ ఉతప్ప అర్ధశతకంతో జట్టును నిలబెట్టాడు. ధోనీ, ఇర్ఫాన్‌ పఠాన్‌ చివర్లో కీలక పరుగులు జోడించి స్కోర్‌ను పోటీకి తగిన స్థాయికి చేర్చారు. పాక్‌ తరఫున ఆసిఫ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో మిస్బా చివరి వరకు పోరాడడంతో మ్యాచ్‌ టై అయింది. అప్పట్లో సూపర్‌ ఓవర్‌ లేకపోవడంతో బౌల్‌-ఔట్‌ నిర్వహించగా, భారత్‌ మూడు ప్రయత్నాల్లోనూ స్టంప్స్‌ కొట్టి 3-0తో గెలిచింది.

#2

2022 మెల్‌బోర్న్‌ మ్యాచ్

160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 31/4తో కష్టాల్లో పడినా, విరాట్‌ కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటి చేత్తో తిప్పేశాడు. చివరి ఓవర్లలో హారిస్‌ రౌఫ్‌ ఓవర్ లో కొట్టిన రెండు సిక్సులు అభిమానులను ఉర్రూతలూగించాయి.

Advertisement

#1

2007 జొహానెస్‌బర్గ్‌ ఫైనల్‌ మ్యాచ్

తొలిస్థానంలో 2007 జొహానెస్‌బర్గ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నిలిచింది. 2007 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో జోగిందర్ శర్మ పాక్ క్రికెటర్ మిస్బా-ఉల్-హక్‌ను ఔట్ చేసి 5 పరుగుల తేడాతో గెలిపించాడు... శ్రీశాంత్ క్యాచ్ అద్భుతమనే చెప్పాలి. ఇది ఇండియాకు తొలి టీ20 ప్రపంచకప్ అందించాడు.

Advertisement