LOADING...
THE STAR ENTERTAINER : ఓవర్సీస్‌లో సెన్సేషన్.. వరుసగా 3 సినిమాలకు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు!
ఓవర్సీస్‌లో సెన్సేషన్.. వరుసగా 3 సినిమాలకు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు!

THE STAR ENTERTAINER : ఓవర్సీస్‌లో సెన్సేషన్.. వరుసగా 3 సినిమాలకు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చేందుకు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను అందుకుంది.

Details

1 మిలియన్ డాలర్లు వసూళ్లుత

కడుపుబ్బా నవ్వించడంతో పాటు, క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజే ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసి షాకిచ్చింది. మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండించింది. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఓవర్సీస్‌లో కూడా 'రాజు గారు' దూసుకెళ్తున్నారు. శనివారం ముగిసే సరికి ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ విజయంతో నవీన్‌ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలు 'జాతి రత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి', 'అనగనగా ఒక రాజు' 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి తీసుకెళ్లిన హీరోగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Advertisement