
కేబుల్ రెడ్డి: పీరియాడిక్ కామెడీ డ్రామాతో వస్తున్న యాక్టర్ సుహాస్
ఈ వార్తాకథనం ఏంటి
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ వంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకులను అలరించిన యాక్టర్ సుహాస్, మరోసారి వైవిధ్యమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
సుహాస్ హీరోగా కేబుల్ రెడ్డి అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇంతకుముందే రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో చూపించిన ప్రకారం, ఈ సినిమాలో కేబుల్ డిష్ ఓనర్ గా సుహాస్ కనిపించనున్నాడని అర్థమవుతోంది.
షాలిని కొండేపూడి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను, బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2024వేసవిలో విడుదలవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుహాస్ ట్వీట్
Here's the first look poster of #CableReddy
— Suhas 📸 (@ActorSuhas) September 21, 2023
In cinemas Summer 2024. Shooting in progress 💥#ShaliniKondepudi @sridharbobbala #BaluVallu #PhaniAcharya @thefanmadefilms #LittleThoughtsCinemas pic.twitter.com/yv6YeTYsva