LOADING...
Kalpika: సిగరెట్‌ కోసం రిసార్టులో నటి కల్పిక హంగామా!
సిగరెట్‌ కోసం రిసార్టులో నటి కల్పిక హంగామా!

Kalpika: సిగరెట్‌ కోసం రిసార్టులో నటి కల్పిక హంగామా!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఈసారి ఆమె నగర శివారులో ఉన్న ఓ రిసార్టులో హంగామా చేసింది. మొయినాబాద్‌ మండలం కనకమామిడి రెవెన్యూలో ఉన్న బ్రౌన్‌టౌన్‌ రిసార్టుకు ఆమె సోమవారం మధ్యాహ్నం చేరుకుంది. అక్కడ ఓ గదిలోకి వెళ్లి భోజనం చేసిన ఆమె,సాయంత్రం అయ్యాక రిసెప్షన్‌ వద్ద పనిచేసే సిబ్బందిని సంప్రదించి సిగరెట్లు కావాలని కోరింది. అయితే సిబ్బంది నుండి స్పందన లేకపోవడంతో ఆమె కాస్త అసహనానికి లోనయ్యారు. వెంటనే రిసెప్షన్‌కు వెళ్లి అక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేనేజర్‌ కృష్ణను లక్ష్యంగా చేసుకొని అసహ్యకరంగా ప్రవర్తించింది.గదిలో వైఫై సౌకర్యం లేదని,ఇతర అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేవని ఆరోపణలు చేసింది.

వివరాలు 

గంటపాటు ఆందోళన చేసిన కల్పిక 

కనీసం సిగరెట్లు తెచ్చివ్వలేరా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ ఎక్కువసేపు ఉండలేనని చెబుతూ గది తాళాలను విసిరేసింది. దాదాపు గంటపాటు ఆందోళనకు దిగిన ఆమె, అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయి నగరానికి చేరుకుంది. తర్వాత మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేసి, రిసార్టు సిబ్బంది తనతో అశ్లీలంగా, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.