Loading...
Balakrishna: క్రిస్మస్‌ రేస్‌ నుంచి బాలయ్య తప్పుకున్నాడా?
క్రిస్మస్‌ రేస్‌ నుంచి బాలయ్య తప్పుకున్నాడా?

Balakrishna: క్రిస్మస్‌ రేస్‌ నుంచి బాలయ్య తప్పుకున్నాడా?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 05, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న 'దాదా' సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే షూటింగ్‌ సమయంలో బాలయ్యకు గాయం కావడం, ఆ తర్వాత సర్జరీతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో షూటింగ్‌ షెడ్యూల్‌లో ఆలస్యం జరిగినట్లు సమాచారం. దీంతో డిసెంబర్‌ 24 డెడ్‌లైన్‌ అందుకోవడం కష్టమవుతుందనే ప్రచారం మొదలైంది. అయితే సినిమా వాయిదాపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Details

ఆలస్యం ఎందుకు?

ప్రస్తుతం బాలకృష్ణ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నప్పటికీ, అనుకున్న వేగంతో పనులు పూర్తి కావడం లేదని టాక్‌.

షూటింగ్‌ పూర్తయ్యాక పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌, ఇతర సాంకేతిక పనులకు తక్కువ సమయం మాత్రమే మిగిలే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో కేవలం రిలీజ్‌ డేట్‌ కోసం తొందరపడటం కంటే సినిమాకు అవసరమైన సమయం ఇవ్వడం మంచిదని కొందరు భావిస్తున్నారట.

క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదంటే వాయిదా వేయాలి అనే ఆలోచన కూడా వినిపిస్తోంది.

Details

డిసెంబర్‌నే ఎందుకు అంటున్నారు?

మరోవైపు 'దాదా'ను డిసెంబర్‌ 24న విడుదల చేయాలనే నిర్ణయానికే యూనిట్‌ కట్టుబడి ఉందన్న మాట కూడా వినిపిస్తోంది. జనవరి ఇప్పటికే భారీ సినిమాలతో నిండిపోగా, మార్చి, ఏప్రిల్‌లో 'ఫౌజీ', 'వారణాసి' వంటి పాన్‌ ఇండియా చిత్రాలు పోటీలో ఉన్నాయి.

అందుకే డిసెంబర్‌ రిలీజ్‌ మేకర్స్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. ఈ డేట్‌ను వదులుకోవడం అంత సులభం కాకపోవచ్చు.

డిసెంబర్‌ 24న 'దాదా'తో పాటు నాగార్జున 'కింగ్‌ 100', షారుఖ్‌ ఖాన్‌ 'కింగ్‌' కూడా బరిలో ఉన్నాయి.

ఒకవేళ బాలయ్య సినిమా వాయిదా పడితే ఆ రెండు చిత్రాలకు పోటీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలే.

ADVERTISEMENT