తదుపరి వార్తా కథనం

విజయ్ లియో నుండి అదిరిపోయే అప్డేట్: అందరూ రెడీగా ఉండాల్సిందే
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 20, 2023
05:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ హీరో విజయ్, లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆల్రెడీ మేకర్స్ మొదలెట్టేసారు.
వినాయక చవితి సందర్భంగా తెలుగు, కన్నడ పోస్టర్లు రిలీజైన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 6గంటలకు లియో నుండి తమిళం, ఇంగ్లీష్ పోస్టర్స్ రిలీజ్ కాబోతున్నాయట.
ఈ మేరకు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాలా విజయబాలన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మనోబాలా విజయబాలన్ ట్వీట్
Tamil & English poster of #LeoFilm will be OUT at 6 PM.
— Manobala Vijayabalan (@ManobalaV) September 20, 2023
||#LeoPosterFeast|| pic.twitter.com/WgHaNAWmgp
మీరు పూర్తి చేశారు