LOADING...
Devagudi: ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్
ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్

Devagudi: ప్రభుత్వ విప్ చేతుల మీదుగా 'దేవగుడి' గ్లింప్స్ లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్యం ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవగుడి'కు సంబంధించిన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సినిమాలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. లాంచ్ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు.

Details

ధన్యవాదాలు తెలిపిన మంత్రి

ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, పిలిచిన వెంటనే ప్రజా సేవలో బిజీగా ఉన్నప్పటికీ కార్యక్రమానికి వచ్చి ఆహ్వానం అందుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నాయకుల నిబద్ధత ప్రేరణగా తీసుకుని, సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.