LOADING...
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్ రీఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై లవర్ బాయ్
అమ్మాయిల డ్రీమ్ బాయ్ రీఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై లవర్ బాయ్

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్ రీఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై లవర్ బాయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

90వ దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమలో లవర్ బాయ్ ఇమేజ్‌తో యువతను ఆకట్టుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. అందమైన ప్రేమకథలతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ జాబితాలో ప్రముఖంగా నిలిచిన హీరోల్లో ఒకరు అబ్బాస్. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్, లుక్, మ్యానరిజంలకు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది.తొలి సినిమాతోనే స్టార్‌డమ్ సంపాదించిన ఆయన, తరువాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లతో కెరీర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే సెకండ్ హీరోగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను స్వీకరించడం కూడా ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది. ఒకప్పుడు చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్, స్టార్ హీరోలకు పోటీ ఇచ్చిన స్థాయికి ఎదిగాడు.

Details

'ప్రేమ దేశం' సినిమాతో హీరోగా పరిచయం

90's యూత్, కిడ్స్ ఈ హీరోను ఇప్పటికీ సులభంగా గుర్తుపడతారు. అబ్బాస్ 1996లో విడుదలైన 'ప్రేమ దేశం' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు కదిర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఈ చిత్రం ద్వారా అబ్బాస్‌కు యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పట్లో చాలా మంది యువకులు ఆయన స్టైల్‌ను అనుసరిస్తూ జుట్టు పెంచుకోవడం, డ్రెస్సింగ్ స్టైల్‌ను కాపీ చేయడం సాధారణమైంది. తక్కువ సమయంలోనే ఆయన తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

Details

ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన అబ్బాస్

అయితే, కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ పాత్రలు చేయడం వల్ల అవకాశాలు క్రమంగా తగ్గాయి. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన అబ్బాస్, తరువాత కాలంలో కేవలం ఒక హార్పిక్ ప్రకటనలో మాత్రమే కనిపించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2015లో 'పచ్చక్కల్లం' సినిమాలో చివరిసారిగా కనిపించిన అబ్బాస్, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న 'హ్యాపీ రాజ్' అనే తమిళ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Advertisement