లిటిల్ డార్లింగ్ ని చూడాలనుందంటూ తల్లి కాబోతున్నట్లు కన్ఫామ్ చేసిన ఇలియానా
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటిన ఇలియానా, ప్రస్తుతం తెలుగు సినిమాలకు బాగా దూరమైంది. ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. తెలుగు సినిమాల్లో టాప్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ కు వెళ్ళిపోయి తెలుగుకు బై చెప్పేసింది. అయితే బాలీవుడ్ లో ఆమెకు అనుకున్నంత విజయాలు రాలేవు. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఇలియానా, తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించేసింది. ఇలియానాకు ఇంకా పెళ్ళి కాలేదు. కత్రినా కైఫ్ తమ్ముడు సెయింట్ లారెంట్ తో సహజీవనం చేస్తోంది ఇలియానా. ప్రస్తుతం వీరు పేరెంట్స్ అవుతున్నారు. ఆ విషయాన్ని తన ఇన్స్ టా అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేసింది.
ఇలియానా పోస్టుకు స్పందించిన ఆమె తల్లి
లిటిల్ డార్లింగ్ ని చూడాలని మనసు తహతహ లాడుతోందని తన సోషల్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది ఇలియానా. ఇంటర్నెట్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చిన్నపిల్లల డ్రెస్ ఫోటోను షేర్ చేసి కామెంట్ చేయడంతో ఇలియానా తల్లి కాబోతుందని కన్ఫామ్ ఐపోయింది. ఇలియనా పోస్టుకు ఆమె తల్లి స్పందిస్తూ, కొత్తగా రాబోతున్న మెంబర్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. సోషల్ మీడియా సాక్షిగా ఇలియానాకు అభినందనలు అందిస్తున్నారు. తెలుగు సినిమాలను వదిలి బాలీవుడ్ కు వెళ్ళిపోయిన ఇలియానా, చాలా రోజుల తర్వాత 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిఇలియానా ఏం పోస్ట్ చేశారంటే?మాలోనూ కనిపించలేదు.