LOADING...
LIK Movie: ప్రేమకు ఇన్సూరెన్స్ ఐడియా.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ వైరల్
ప్రేమకు ఇన్సూరెన్స్ ఐడియా.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ వైరల్

LIK Movie: ప్రేమకు ఇన్సూరెన్స్ ఐడియా.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లవ్ టుడే' సినిమాతో యువతలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, తెలుగు ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ప్రేమకే ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ కథ 2040లోని భవిష్యత్ ప్రపంచాన్ని నేపథ్యంగా తీసుకుని సాగుతుంది. ఎవరు ఎవరితో కలిస్తే బాగుంటుందో నిర్ణయించేలా ఎస్. జె. సూర్య 'ఎల్ఐకె' అనే యాప్‌ను రూపొందిస్తాడు. ఆ యాప్ ప్రభావంతో ప్రేమలో విఫలమైన ఓ యువకుడి పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపించనున్నాడు.

వివరాలు

ఎనర్జీతో ఆకట్టుకున్న ప్రదీప్ రంగరాజన్

సోషల్ మీడియా మోజుతో ఉండే 'ధీమా' పాత్రలో కీర్తిశెట్టి నటించగా, ఆమెను ప్రేమించే 'వైబ్ వాసు'గా ప్రదీప్ నటించాడు. ట్రైలర్‌లో ప్రదీప్ తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఒక యాప్ ఒప్పుకోలేదని బ్రేకప్ చెప్తున్నారా? అనే డైలాగ్ నేటి తరం ప్రేమ వ్యవహారాలపై సెటైర్‌గా నిలిచింది. అలాగే ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చేయలేదని ప్రూవ్ చేస్తా అనే డైలాగ్ సినిమాకు ప్రధాన భావాన్ని తెలియజేస్తోంది. ప్రదీప్, కృతి శెట్టిల మధ్య కెమిస్ట్రీ కూడా కొత్తగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో పాటు ఎస్.జె. సూర్య నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

వివరాలు

ఈనెల 10న రిలీజ్

అనిరుధ్ రవిచంద్రన్ అందించిన నేపథ్య సంగీతం, రవివర్మ కెమెరా పనితనం ట్రైలర్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఈ చిత్రాన్ని నయనతార, ఎస్. ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 10న ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

Advertisement