
Jack : జాక్ ఎఫెక్టు.. రెమ్యూనేషన్‌ను వెనక్కి ఇచ్చిన సిద్ధూ
ఈ వార్తాకథనం ఏంటి
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'జాక్' చిత్రం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి వరుస హిట్ల తర్వాత ఈ సినిమా వచ్చినప్పటికీ, అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
ముఖ్యంగా నైజాం కొన్ని ఇతర ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి నిర్మాతకు మద్దతుగా హీరో సిద్దు ముందుకు వచ్చాడు.
'జాక్' సినిమా కోసం సిద్దు జొన్నలగడ్డకు మొత్తం 8 కోట్ల రూపాయల పారితోషికం ఉంది.
Details
రూ. 4 కోట్లు ఇచ్చిన సిద్ధు
తాజా సమాచారం ప్రకారం, తన మొత్తం పారితోషికంలో నుంచి సగం, అంటే 4 కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును, బాధ్యతాయుతమైన నైతిక విలువలను ప్రదర్శించాడు.
ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో అరుదైన, మంచి ఉదాహరణగా చేర్చుకుంది. సిద్దు తీసుకున్న ఈ బాధ్యతాయుత నిర్ణయంపై నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు ఎంతో ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో అతని మంచితనంపై అభిమతాలు వెల్లువెత్తుతున్నాయి.
అభిమానులు, సినీ విశ్లేషకులు కూడా "సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా ఉంటే, సినిమా రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కామెంట్స్ చేస్తున్నారు.