LOADING...
Malavika Mohanan: ఒంటరితనం నన్ను కుంగదీసింది.. మాళవిక మోహనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!
ఒంటరితనం నన్ను కుంగదీసింది.. మాళవిక మోహనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

Malavika Mohanan: ఒంటరితనం నన్ను కుంగదీసింది.. మాళవిక మోహనన్ భావోద్వేగ వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒంటరితనం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని నటి మాళవిక మోహనన్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా మార్చి నెలలో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఆమె ఒక భావోద్వేగపూరిత పోస్టు చేశారు. గత నెల తనకు మిశ్రమ అనుభూతులను ఇచ్చిందని పేర్కొన్నారు. గత నెలలో నాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పాకెట్ నవల్' ప్రాజెక్ట్‌లో పనిచేయడం ఒక ప్రత్యేక అనుభవం. ఆయన అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మూవీ మేకింగ్ శైలిని గమనించడం, ఆయన మార్గదర్శకత్వంలో నటిగా మరింత మెరుగుపడటం నాకు సృజనాత్మకంగా ఎంతో ఉపయోగపడిందని ఆమె తెలిపారు.

వివరాలు

ఆ సమయంలో ఇష్టమైన భోజనం ఆస్వాదిస్తా

షూటింగ్ కారణంగా నెలలో ఎక్కువ రోజులు చెన్నైలో గడిపినట్లు ఆమె చెప్పారు. పని బాగా ఉన్నప్పటికీ, ఇంటికి దూరంగా ఉండటం తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. రోజంతా షూటింగ్‌లో బిజీగా గడిపి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒంటరిగా ఉన్నాననే భావన నన్ను చాలా బాధించింది. ఆ ఫీలింగ్‌ను తట్టుకోవడం అంత సులభం కాలేదని మాళవిక పేర్కొన్నారు. అయితే తన కుటుంబ సభ్యులు చెన్నైకు వచ్చి కలిసినప్పుడు కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు. ఆ సమయంలో ఇష్టమైన భోజనం ఆస్వాదిస్తూ కొంత రిలాక్స్ అయ్యానని చెప్పారు. ఇటీవలే ముంబయికి తిరిగి వచ్చిన ఆమె, ఇంటి నుంచి దూరంగా ఉన్న భావనను దూరం చేసుకోవడానికి సాయంత్రం వేళల్లో పడవ ప్రయాణాలకు వెళ్తున్నానని వెల్లడించారు.

Advertisement