Page Loader
JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ 'జిగ్రీస్' ఫస్ట్ లుక్ ఔట్.. సందీప్ రెడ్డి లాంచ్ చేసిన పోస్టర్!
మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ 'జిగ్రీస్' ఫస్ట్ లుక్ ఔట్.. సందీప్ రెడ్డి లాంచ్ చేసిన పోస్టర్!

JIGRIS : మ్యాడ్ బాయ్ రామ్ నితిన్ 'జిగ్రీస్' ఫస్ట్ లుక్ ఔట్.. సందీప్ రెడ్డి లాంచ్ చేసిన పోస్టర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 30, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా పంచ్‌లు, చిన్న చిన్న విభేదాల నేపథ్యంలో రూపొందే చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. అలా ఫ్రెండ్‌షిప్ ఆధారంగా ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌తో మరో దోస్త్ గ్యాంగ్ తెరపైకి రాబోతోంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతగా కృష్ణ వోడపల్లి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు 'జిగ్రీస్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'జిగ్రీస్' టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు

ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే, ఒక వింటేజ్ మారుతీ 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ను పై నుంచి చూపించే శాట్ ఆకట్టుకుంటోంది. ఆరెంజ్ బ్యాక్‌డ్రాప్, గ్రిట్టీ టైటిల్ డిజైన్ సినిమాకు ఉండబోయే యూత్‌ఫుల్ ఎనర్జీని, అడ్వెంచర్ టోన్‌ను ప్రతిబింబిస్తోంది. ఈ ఫస్ట్ లుక్, టైటిల్ సోషల్ మీడియాలో మంచి స్పందనను పొందాయి. 'జిగ్రీస్' చిన్ననాటి స్నేహితుల బంధం, నాస్టాల్జియా, రోడ్ ట్రిప్, హాస్యాన్ని మేళవించిన వినోదాత్మక చిత్రంగా ఉండనుంది. టెక్నికల్ టీమ్‌ విషయానికొస్తే, ఈశ్వరాదిత్య సినిమాటోగ్రఫీ, కమ్రాన్ సంగీతం, చాణక్య రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది.