Loading...
Imran Khan Actor: అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలి.. ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు
అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలి.. ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

Imran Khan Actor: అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలి.. ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) నుంచి ఊహించని షాక్ తగిలింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులను బాంబే హైకోర్టులో సవాల్ చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వివరాలు

సీజేపీ నిరసనలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్

వివరాల్లోకి వెళితే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ నిరసనలో ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామి, నటి లేఖా వాషింగ్టన్‌తో పాటు తన కజిన్ జయాన్ మేరీ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ క్రమంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్, లేఖా వాషింగ్టన్, జయాన్ మేరీ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే అదే రోజు రాత్రి వారిని విడుదల చేశారు. ఈ ఘటన అనంతరం ఇమ్రాన్ ఖాన్‌కు FRRO నుంచి నోటీసులు రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

బీజేపీ నేత ఫిర్యాదుతో నోటీసులు?

విదేశీ పౌరసత్వం కలిగిన వ్యక్తి రాజకీయ నిరసనలో పాల్గొనడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే FRRO అధికారులు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

అక్టోబర్ 28లోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ నోటీసులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

సోషల్ మీడియాలో స్పందించిన లేఖా వాషింగ్టన్

ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన భాగస్వామి లేఖా వాషింగ్టన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

గతంలో నిరసన సందర్భంగా పోలీసు వ్యాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి ఉన్న ఫొటోను లేఖా వాషింగ్టన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఫొటోకు 'జస్ట్' అనే క్యాప్షన్‌తో పాటు హార్ట్ ఎమోజీలను జత చేశారు. గతంలోనూ లేఖా వాషింగ్టన్ ఈ ఘటనపై స్పందించారు.

తాము నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లలేదని, పోలీసుల అదుపులో ఉన్న తమ స్నేహితుల గురించి తెలుసుకోవడానికే వెళ్లామని ఆమె వెల్లడించారు.

ఆ సమయంలో పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని, తమకు గాయాలయ్యాయని కూడా ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు

తదుపరి పరిణామాలపై ఆసక్తి

మొత్తంగా ముంబైలో జరిగిన సీజేపీ నిరసన కార్యక్రమం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు FRRO జారీ చేసిన నోటీసులతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ నోటీసులను ఆయన న్యాయస్థానంలో సవాల్ చేయనున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT