నయన తారకు భలే ఛాన్స్, దిగ్గజాల సినిమాలో అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన తార, కమల్ హాసన్ తో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కే కేహెచ్ 234 సినిమాలో నయన తార హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు.
ఈ విషయమై కోలీవుడ్ ఫిలిమ్ సర్కిల్స్ నుండి సమాచారం అందుతోంది. ఇదే నిజమైతే కమల్ హాసన్ తో నయనతార నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది.
అయితే గతంలో, ఈ చిత్రంలో త్రిష కనిపిస్తుందని అన్నారు. సడెన్ గా ఏమైందో తెలియదు కానీ నయన తారకు అవకాశం వచ్చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అధికారిక సమాచారం బయటకు రాలేదు.
Details
1987లోని నాయకుడు తర్వాత కమల్ హాసన్ తో రెండవ చిత్రం చేస్తున్న మణిరంత్న
పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన తర్వాత కమల్ హాసన్ తో తెరకెక్కించే సినిమా పనుల్లో మణిరత్నం బిజీగా ఉంటారట. హీరోయిన్ విషయంలో మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం వచ్చేస్తుందని, నయన తార ఫిక్స్ అయిపోయినట్టేనని చెబుతున్నారు.
1987లో వచ్చిన నాయకుడు తర్వాత ఇప్పుడు కేహెచ్ 234సినిమాతో మరోసారి మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్నాడు కమల్ హాసన్.
నయన తార ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడూతోంది నయన తార.
ఇక కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని చేస్తున్నాడు. చాలావరకు చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఈ సంవత్సరంలో వెండితెర మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారు.