Loading...
Mohan Babu: 'నన్ను చూసినా భయపడతారు'.. 'ది ప్యారడైజ్‌'పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
'నన్ను చూసినా భయపడతారు'.. 'ది ప్యారడైజ్‌'పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan Babu: 'నన్ను చూసినా భయపడతారు'.. 'ది ప్యారడైజ్‌'పై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మరోసారి నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారారు. ఓ కాలేజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా తాను నటించిన 'ది ప్యారడైజ్‌' సినిమా గురించి మోహన్‌ బాబు ప్రస్తావించడంతో, ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి. కాలేజ్‌ ఈవెంట్‌లో విద్యార్థులను ఉద్దేశించి మోహన్‌ బాబు మాట్లాడుతున్న సమయంలో 'ప్యారడైజ్‌' అనే పదాన్ని ప్రస్తావించారు. దీంతో సభలో ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఆ చప్పట్లన్నీ తాను నటించిన 'ది ప్యారడైజ్‌' సినిమా కోసమేనని మోహన్‌ బాబు గ్రహించారు.

వివరాలు

 మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర ఎంత భయంకరంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. "ఆ సినిమా చూస్తే నా దగ్గరకు కూడా రారు మీరు.. అంత భయంకరమైన క్యారెక్టర్‌ అది అంటూ మోహన్‌ బాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

మోహన్‌ బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే.. 'ది ప్యారడైజ్‌' సినిమాలో ఆయన పాత్ర ఎంత తీవ్ర స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

అలాగే ఆ పాత్ర ప్రేక్షకులను ఏ రేంజ్‌లో భయపెట్టబోతోందన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.

వివరాలు

అతృతుగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏళ్లుగా ఎన్నో పవర్‌ఫుల్‌ పాత్రల్లో నటిస్తూ, అద్భుతమైన విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన మోహన్‌ బాబు.. ఈసారి తన గత క్యారెక్టర్స్‌ను మించేలా ఓ భయంకరమైన నెగెటివ్‌ రోల్‌లో కనిపించబోతున్నారని ఆయన మాటలతో స్పష్టమైంది.

'ది ప్యారడైజ్‌' సినిమాతో మోహన్‌ బాబు మరోసారి వెండితెరపై తన విశ్వరూపాన్ని చూపించబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ నేపథ్యంలో 'ది ప్యారడైజ్‌'లో మోహన్‌ బాబు పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT