LOADING...
Raj Tarun : మాస్ లుక్‌లో రాజ్ తరుణ్.. 'టార్టాయిస్'తో కొత్త అవతారం
మాస్ లుక్‌లో రాజ్ తరుణ్.. 'టార్టాయిస్'తో కొత్త అవతారం

Raj Tarun : మాస్ లుక్‌లో రాజ్ తరుణ్.. 'టార్టాయిస్'తో కొత్త అవతారం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'టార్టాయిస్'పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌విఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వివరాలు

వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు

ఇక హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం 'టార్టాయిస్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది. 'టార్టాయిస్' ఒక విభిన్నమైన థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, రాజ్ తరుణ్ కెరీర్‌లో ఇది 25వ సినిమాగా ప్రత్యేక స్థానం సంపాదించుకోనుందని తెలిపింది. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ కథలో హీరోకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అయితే ఆ సమయంలో అతడు తెలియకుండానే కొన్ని హత్యలు చేస్తుంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలే సినిమా కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

Advertisement